మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమాతోనే తెలుగు తెరకి దర్శకుడిగా శరత్ మండవ పరిచయమయ్యాడు.రవితేజ సరసన నాయికలుగా దివ్యాన్ష కౌశిక్ .. రజీషా విజయన్ నటించారు. నాజర్ .. నరేశ్ .. వేణు తొట్టెంపూడి .. తనికెళ్ల భరణి ముఖ్యమైన పాత్రలను పోషించగా, అన్వేషి ఐటమ్ సాంగ్ చేసింది. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి సామ్ సిఎస్ సంగీతాన్ని అందించారు. రవితేజ కూడా ఒక నిర్మాతగా ఉన్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య గత నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ, కథనం వీక్ గా ఉండటం రవితేజ స్టైల్ కు భిన్నంగా ఉండటంతో ఈ సినిమా మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. రవితేజ అభిమానులు అయితే ఏకంగా దర్శకుడిపై ఫైర్ అయ్యారు. తెరపై పాత్రలు మారిపోతుండటం, ఏ పాత్రకీ ఒక క్యారెక్టరైజేషన్ కనిపించకపోవడం, డైలాగ్స్ .. యాక్షన్ .. డాన్స్ పరంగా కూడా రవితేజ మార్క్ మిస్సవ్వడం ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. ఇక హీరోయిన్స్ గురించి అయితే ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. రజీషా విజయన్ రవితేజ సరసన అసలు సెట్ కాలేదు. వేణు తొట్టెంపూడి సీరియస్ గా నటిస్తూనే ఉన్నా కామెడీ చేస్తున్నట్లు మనకు అనిపిస్తోంది. తన డబ్బింగ్ ను తానే చెప్పుకోవడంతో వేణు పాత్ర తేలిపోయింది.
ఇక నిరాశ పరిచిన ఈ సినిమాకు సీక్వెల్ ఉందంటూ దర్శకుడు రివీల్ చేయడంతో ‘ఓహో .. సీక్వెల్ ఉందన్నమాట’ అనుకుని సీట్లలో నుంచి మనం లేవాలన్న మాట .కథలో కొత్తదనం లేకపోవడం .. కథనంలో ఆసక్తి లేకపోవడం .. కొన్ని సన్నివేశాలు artifical గా అనిపించడం .. పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం .. ప్రధానమైన పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడం .. గుర్తుపెట్టుకోలేనంతగా చిన్న పాత్రలు పెరిగిపోవడం .. డైలాగ్స్ లోను పసలేకపోవడం లోపంగా కనిపిస్తాయి. ఇన్నీ మైనస్ లు ఉండటంతో ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి. ఈ సినిమా మూడు రోజులకు కేవలం 4.26 కోట్ల షేర్ 7.45 కోట్ల గ్రాస్ మాత్రమే వసూల్ చేసింది.
Nizam: 1.05Cr
Ceeded: 62L
UA: 53L
East: 37L
West: 20L
Guntur: 30L
Krishna: 22L
Nellore: 15L
AP-TG Total:- 3.78CR(5.80Cr~ Gross)
KA+ ROI: 0.30Cr
OS: 45L
Total World Wide: 4.26CR(7.45CR~ Gross)
ఈ సినిమాకు 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా దాదాపు 14 కోట్లు వసూల్ చేయవలసి ఉంది. ఈ ఏడాది రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు డిజాస్టర్ అని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తుంటే డిజాస్టర్ కా బాప్ లా రామారావు కలెక్షన్స్ ఉన్నాయి.