బిగ్ బాస్ ఓటీటీ సీజన్ తర్వాత చాలా గ్రాండ్ గా సీజన్ 6ని స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇందుకు గానూ ఈసారి 17మంది సెలబ్రిటీలని, ఇద్దరు ముగ్గురు పార్టిసిపెంట్స్ ని హౌస్ లోకి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది పేర్లు వినిపించినా పూర్తి స్థాయి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈసారి బిగ్ బాస్ సెట్ కూడా కనివినీ ఎరుగని తీరులో కనిపించబోతోంది. రీసంట్ గా ఈ సెట్ ని పూర్తి చేసి షోకి రెడీ చేసినట్లుగా చెప్తున్నారు. ఈసారి కూడా బిగ్ బాస్ షో 100రోజులు పైనే కొనసాగబోతోంది. టివి యాంకర్స్, సింగర్స్, కొరియోగ్రాఫర్స్, సోషల్ మీడియా ఫేమ్ యాంకర్స్, ఆర్టిస్ట్స్, హీరోయిన్స్ ఇలా డిఫరెంట్ కేటగిరిల్లో నుంచీ పార్టిసిపిపెంట్స్ రాబోతున్నారు.

ఇదిలా ఉంటే, మరోవైపు బిగ్ బాస్ యాంకర్ ని మారుస్తున్నారని రూమర్స్ బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి హోస్ట్ గా నాగార్జున చేయడం లేదని చాలామంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ, ఇందులో వాస్తవం లేదని బిగ్ బాస్ టీమ్ చెప్పకనే చెప్పింది. రీసంట్ గా ఒక ప్రోమోని నాగార్జునపైన షూట్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. ప్రోమో ఈసారి చాలా డిఫరెంట్ గా ఉండబోతోందట. ఈ ప్రోమో కోసం నాగార్జున రెండు గెటప్స్ వేసుకున్నాడని చెప్తున్నారు. ఇక అతి త్వరలోనే ప్రోమో రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు, సెట్ లో కూడా ఈసారి ఒక ప్రోమోని తీయబోతున్నారని టాక్.

బిగ్ బాస్ సీజన్ – 6 కోసం మాటీవి చాలా భారీగా ఖర్చు చేస్తోంది. లాస్ట్ టైమ్ ఓటీటీలో స్పాన్సర్స్ లేకుండానే షోని ముగించారు. కానీ, ఈసారి మాత్రం స్పాన్సర్స్ భారీగానే రాబోతున్నారు. అంతేకాదు, స్పెషల్ డేస్ లో మరికొంత మంది స్పాన్సర్స్ ని కూడా యాడ్ చేయబోతున్నారు. ఇప్పటికే గడిచిన ఐదు సీజన్స్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సీజన్ 3 నుంచీ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. లాస్ట్ టైమ్ ఓటీటీలో నాగార్జున చాలా డిఫరెంట్ గా యాంకరింగ్ చేసి ప్రేక్షకులని మెప్పించారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉంటే ఈసారి యాంకర్ గా నాగార్జునకి 100కి వంద మార్కులు వేసేస్తారు బిగ్ బాస్ లవర్స్. ఎందుకంటే, సీజన్ 5లో కొద్దిగా నాగార్జున యాంకరింగ్ పై విమర్శలు వచ్చాయి. షణ్ముక్ – సిరిల విషయంలో నాగార్జున క్లాస్ పీకలేదని చాలామంది బిగ్ బాస్ ప్రేక్షకులు కామెంట్స్ చేశారు. కానీ, ఓటీటీలో మాత్రం నాగార్జున యాంకరింగ్ తిరుగులేదని నిరూపించుకున్నారు. దీంతో అదే అంచనాలతో ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ సీజన్ 6కోసం వెయిట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *