కోలీవుడ్ స్టార్ హీరో కార్తికి తెలుగులో మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో వరసుగా సినిమాలు చేస్తూ వాటిని తెలుగులో కూడా రిలీజ్ చేసి టాలీవుడ్ లో కూడా అభిమానుల్ని సంపాదించుకున్నాడు కార్తీ. ఈ టైమ్ లో చేసిన సినిమానే నాపేరు శివ. ఈ సినిమా తెలుగులో యావరేజ్ గా పాసైపోయింది. నిజానికి ఈసినిమా కార్తీ సొంత బ్యానర్ అయిన స్టూడియో గ్రీన్ నుంచీ ప్రొడ్యూస్ అయ్యింది. జ్ఞానవేల్ రాజా సినిమాని నిర్మించారు. ఈ కాంబినేషన్ లోనే అప్పట్లో ఆవారా, యుగానికి ఒక్కడు సినిమాలు మంచి సక్సెస్ ని సాధించాయి. నాపేరు శివ సినిమా పార్ట్ 2ని పా రంజిత్ తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగులో ఇప్పుడు విడుదల కాబోతోంది. సంక్రాంతికి కానుకగా ఈ సినిమా వస్తోందని సమాచారం. జనవరి 13వ తేదిన ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పా రంజిత్ వచ్చిన కొత్తల్లో ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు.

అయితే, కొన్ని కారణాల వల్ల ఇది తెలుగులో రిలీజ్ చేయలేకపోయారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత సినిమా మళ్లీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పా రంజిత్ తీసిన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక తమిళ హీరోగా తెలుగులో మంచి మార్కెట్ ఉన్న హీరో కార్తీ. సంక్రాంతికి వచ్చిన తమిళ హీరో ఏ సినిమా కూడా ఫ్లాప్ టాక్ రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. అంతేకాదు, అజిత్ వలిమై సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉంది కాబట్టి, ఇప్పుడు నా పేరు శివ 2కి కలిసొచ్చేలాగానే కనిపిస్తోంది. ఇక తెలుగులో కూడా పెద్ద బడ్జెట్ సినిమాలు రేస్ నుంచీ తప్పుకున్నాయి కాబట్టి, ఇప్పుడు ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *