కథలు, క్యారెక్టర్లు, లుక్స్ పరంగా ప్రయోగాలకు ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉండే కథానాయకుడు విక్రమ్. ( Vikram chiyaan ) ఆయన తాజా సినిమా ‘తంగలాన్. ఈ మూవీ టీజర్, ట్రైలర్ కొత్తగా కనిపించాయి. మరి, ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం..
సినిమా కథ ఏంటంటే..
తంగలాన్ ( thanglaan ) అంటే విక్రమ్, గంగమ్మ అంటే పర్వతీ వీరిద్దరూ భార్యభర్తలు.. తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. పంట చేతికి వచ్చిన సమయంలో ఎవరో తగలబెడతారు. పన్నులు కట్టలేదని ఊరి జమీందారు పంట పొలం స్వాధీనం చేసుకుని, కుటుంబం అంతటినీ వెట్టి చాకిరీ చేయాలని ఆదేశిస్తాడు. సరిగ్గా ఆ సమయంలో క్లెమెంట్ దొర వస్తాడు. బంగారు గనులు తవ్వడానికి తనతో వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానని చెబుతాడు. తంగలాన్’కు తరచూ కల వస్తుంది. అందులో అతని తాతను ఆరతి (మాళవికా మోహనన్) వెంటాడుతూ ఉంటుంది. ఆమె ఎవరు? బ్రిటీషర్లతో కలిసి బంగారం తవ్వడానికి వెళ్లిన తంగలాన్, అతని సమూహానికి ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? అరణ్య ఎవరు? చివరకు తంగలాన్ ఏం తెలుసుకున్నాడు? బంగారం దొరికిందా? లేదా? అనేది సినిమా.
మూవీ ఎలా ఉందంటే? Movie Review
తంగలాన్’ ప్రారంభమే ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతుంది. బ్లౌజ్ లు లేని మహిళలు, కుటుంబమంతా కలిసి వ్యవసాయం చేసే తీరు, గూడెం ప్రజలు సరదాగా కబుర్లు చెప్పుకోవడం వంటివి కొత్తగా కనిపించాయి. తంగలాన్’కు వచ్చే కలలు సినిమా ప్రారంభం నుంచి కథపై ఆసక్తి కలిగిస్తాయి. ఓ దశలో అతనికి వచ్చేది కల మాత్రమేనా? లేదంటే నిజంగా ఆ విధంగా జరిగిందా? అని ప్రేక్షకులు ఆలోచించడం మొదలు పెడతారు. కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లడం కోసం మొదట్లో పాత్రల పరిచయానికి సమయం తీసుకున్నారని అనుకున్నా… కథ ఓ కొలిక్కి వచ్చాక, కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ అయిన తర్వాత కూడా కొన్ని సన్నివేశాల కోసం ఎక్కువ సమయం తీసుకున్నారు.
ప్లస్ పాయింట్స్ ( Plus Points )
విక్రమ్ ప్రాణం పెట్టి సినిమా చేశారు. నటుడిగా తనలో కొత్త కోణాన్ని చూపించారు. ‘తంగలాన్’ కథ, ఆ క్యారెక్టర్లు సరికొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లడం గ్యారంటీ. మరీ ముఖ్యంగా విక్రమ్, మాళవిక, పార్వతిల నటన పూర్వీకుల కాలాన్ని కళ్ల ముందు ఆవిష్కరించింది. డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుంది. పార్వతి తిరువొతు సైతం గంగమ్మ పాత్రలో ఒదిగిపోయారు.
మైనస్ పాయింట్స్.. ( Minus Points )
విక్రమ్ కష్టానికి, నిర్మాత ఖర్చుకు తగ్గ సినిమా ఇవ్వడంలో పా రంజిత్ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. తంగలాన్’కు మెయిన్ ప్రాబ్లమ్ సెకండాఫ్. బంగారం కోసం వెళ్లిన ప్రజలను ఆ బంగారానికి కాపలాగా ఉంటున్న అరణ్య ఏం చేస్తుందో మొదట్లో చూపించారు. ఆ సన్నివేశాలు థ్రిల్ ఇచ్చాయి. ఇంటర్వెల్ తర్వాత మరొకసారి ఆ సన్నివేశాలు రావడం రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
ఓవరాల్‌గా… చెప్పాలంటే పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఓ ప్రయోగాత్మక మూవీని ఎంజాయ్ చేయాలనుకునేవారికి ‘తంగలాన్’ కచ్ఛితంగా నచ్చుతుంది.
ఈ సినిమాకు మా ఛానల్ ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5