బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ( Ram Potineni ) ఇస్మార్ట్ శంకర్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా పూరికి మంచి కమ్ బ్యాక్ మూవీ అయ్యిందా లేదా అనేది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే…

ఈ పార్ట్ 2 కథేంటి.. ఒక ఇంటర్నేషనల్ డాన్ , గన్స్ సప్లై చేసే బిగ్ బుల్ సంజయ్ దత్
ఒక సీరియస్ బ్రైయిన్ ట్యూమర్ తో బాధపడుతుంటాడు. తన మొమరీని ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని అనుకున్న బిగ్ బుల్.. హైదరాబాద్ లో ఉన్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ గురించి తెలుసుకుంటాడు. అతను అయితే ఈ ప్రయోగం కోసం సెట్ అవుతాడని గ్రహించి గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో శంకర్ జీవితంలో అనుకోని విషాదం జరుగుతుంది. అదేంటి..అసలు ఈ డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఆడిన గేమ్ ఏంటి.. బిగ్ బుల్ చేసే దందా ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్: ( Plus Points )

రామ్ మాస్ పెర్పామన్స్ సూపర్ అనిపిస్తుంది. అళాగే, సంజయ్ దత్ బిగ్ బుల్ క్యారెక్టర్ డిజైన్ కానీ, యాక్టింగ్ కానీ సింప్లీ సూపర్. హీరోయిన్ కావ్య గ్లామర్ ఆకట్టుకుంటుంది. సినిమాలో ఫైట్స్ , యాక్షన్ బాగుంటుంది. అలాగే కొన్ని డైలాగ్స్ మాస్ ని ఈలలు వేయిస్తాయి. రామ్ తో కెమిస్ట్రీ బాగుంది. క్లైమాక్స్, పోలీస్ స్టేషన్ సీన్స్ సినిమాని నిలబెట్టాయనే చెప్పాలి.

ఇక మైనస్ పాయింట్స్ చూస్తే., ( Minus Points )
ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ అయితే కొట్టలేకపోయాడు పూరీ జగన్. ఎందుకంటే, ఏదో ట్రై చేసి కథలో ట్విస్ట్ లు అనుకుని ఏటెటో సినిమాని తీస్కుని వెళ్లాడు. ప్రేక్షకులకి రీచ్ అయ్యే రేంజ్ లో సినిమా స్క్రీన్ ప్లే ఉండదు. కొన్ని సీన్స్ తప్పిస్తే, ఓవర్ ఆల్ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ఓకేలే అని సెకండ్ హాఫ్ లోకి వెళితే అక్కడ కూడా ఓకే అనిపిస్తుంది. యావరేజ్ గా సినిమా ఉందనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. సినిమాలో లాజిక్స్ బాగా మిస్ అయ్యారు. మైయిన్ గా పూరీ మార్క్ సినిమాలో మిస్ అయిపోయింది. అలీ కామెడీ కూడా పెద్దగా పేలలేదు.

ఓవర్ ఆల్ గా చెప్పాలంటే.., ఈ డబుల్ ఇస్మార్ట్ శంకర్ కొద్దిగా బోర్ కొట్టిస్తాడు. వీలుంటే థియేటర్ లో చూడండి.. లేదంటే ఓటీటీలో చూడండి..

మా ఛానల్ ఇచ్చే రేటింగ్ 2 అవుట్ హాఫ్ 5

 

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *