తారాగణం, సాంకేతిక నిపుణులు:
హీరో: రాజ్ తరుణ్
కథానాయిక: హాసిని సుధీర్
ఇతర నటీనటులు: బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, విరాన్ ముత్తంశెట్టి
దర్శకుడు: రామ్ భీమన
నిర్మాతలు: ప్రకాష్ తేజావత్, రమేష్ తేజావత్
సంగీతం: గోపీ సుందర్
ఛాయాగ్రహణం: పి జి విందా

ఇటీవ‌ల‌ హాట్ టాపిక్‌గా ఉండే హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం ‘పురుషోత్తముడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
లండన్‌లో చదువుకున్న రచిత్ రామ్ (రాజ్ తరుణ్) హైదరాబాద్‌కు వచ్చి తన తండ్రి (మురళీశర్మ) త‌ర్వాత‌ పరశురామయ్య ఎంటర్‌ప్రైజెస్ కంపెనీకి CEO అవ్వాలని అనుకుంటాడు. అయితే కంపెనీ నియమాల ప్రకారం, CEO అవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు అజ్ఞాతంలో సామాన్య జీవితం గడపాలి. ఈ క్రమంలో రచిత్ రామ్ ఆ ష‌రతులకు లోబడి బయటకు వస్తాడు. దూరంగా ఒక ఊరిలో అన్యాయానికి గురైన రైతులకు సహాయం చేస్తూ, పూల తోటలు పెంచుతున్న అమ్ములు (హాసిని సుధీర్)కి దగ్గరవుతాడు. అక్క‌డే ఎన్నో ట్విస్టులు చోటు చేసుకుంటాయి. ఈ క్ర‌మంలో అమ్ములతో ఎలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతుంది? చివరికి రచిత్ రామ్ CEO అవుతాడా? లేదా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల ప్ర‌తిభ:
రాజ్ తరుణ్ గత సినిమాల కంటే ఈ చిత్రంలో గ్లామర్‌గా కనిపిస్తాడు. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’లో చేసినటువంటి పాత్రను రాజ్ తరుణ్ న‌టించి త‌న పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్ హాసిని సుధీర్ తన అందంతో ఆకట్టుకుంది. యాక్టింగ్‌లో మరింత ప‌రిణితి అవసరం. రమ్యకృష్ణ తన పాత్రలో హుందాగా నటించి స‌త్తా చూపింది. విరాన్ ముత్తంశెట్టి, మురళీ శర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రవీణ్ కామెడీ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ అతిథి పాత్రలో తక్కువ సేపు కనిపించినప్పటికీ, చివర్లో చెప్పిన డైలాగులు బాగా పేలాయి.

సాంకేతిక విభాగం:
క్వాలిటీ పరంగా చూస్తే సినిమాకు పూర్తి మార్కులు వేయవచ్చు. ఫోటోగ్రఫీ, గోపీ సుందర్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు వినసొంపుగా ఉన్నాయి. మాటలు బాగున్నాయి. నాణ్యత విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు సరైన బడ్జెట్ పెట్టినట్టు అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుంది. రన్ టైమ్ 2 గంటలే ఉండటం మరో ప్లస్ పాయింట్.

విశ్లేషణ:
దర్శకుడు తన అనుకున్న కథను స్పష్టంగా తెరపైకి ఎక్కించడంలో సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే బాగుంది. B, C సెంటర్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే సీన్స్ ఉన్నాయి. ఫైట్లు, కామెడీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. కథ, పాటలు, ఫైటింగ్‌లు సరైన పాళ్లలో ఉన్న ఈ ‘పురుషోత్తముడు’ వీకెండ్‌లో చూడవచ్చు.

  • రేటింగ్: 3.75 / 5

 

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *