ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ – రేండ్ రెండు మారిపోయాయ్. ప్రస్తుతం కొరటాల శివతో దేవర అంటూ మరోసారి ట్రైబల్ లుక్ లో కనిపించబోతున్నాడు తారక్. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ట్రిబుల్ ఆర్ లో కొమురం భీమ్ కి వచ్చిన రెస్పాన్స్ ఆ గెటప్ లుక్ అనే చెప్పాలి. ట్రైబల్ ఏరియాకి సంబంధించిన లుక్స్ లో ఎన్టీఆర్ అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు దేవర అనే సబ్జెక్ట్ లో కూడా అలాగే కనిపించబోతున్నాడు. అందుకే, ఆ లుక్ కి అంత ఇంపార్టెన్స్ వచ్చింది. ఈసినిమాని కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్ ని లైన్లో పెడుతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.

దేవర సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఈ ఏడాదే తారక్ వార్2 షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. వార్2 సినిమా కోసం తారక్ మూడు నెలల డేట్స్ కేటాయించాడట. దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నాడు అనేది టాక్. ఇక వఛ్చే ఏడాది మార్చి నుంచి తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మొదలుకానుంది. ఈ సినిమా బౌండ్ స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైందని చెప్తున్నారు. ఏడాది గ్యాప్ లో తారక్ నటించిన ఈ మూడు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యే అవకాశం ఉంటుంది. తారక్ కు ఈ మూడు సినిమాల ద్వారా 250 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే ఛాన్స్ ఉంది. ఇంకో విశేషం ఏంటంటే, తారక్ కు ప్రతి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్లు జోడీగా నటిస్తున్నారు. దీంతో హిందీలో కూడా హ్యూజ్ మార్కెట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ మూవీని రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ ఫినిష్ చేసినట్లే. ఫస్ట్ పార్ట్ కి వచ్చిన రెస్పాన్స్ ని బట్టీ సెకండ్ పార్ట్ షూటింగ్స్ ని కూడా ప్లాన్ చేస్తాడు. అది కూడా తారక్ తో సినిమా కమిట్ అవ్వకముందే ఫినిష్ చేసేయాలి. కాబట్టి చాలా స్పీడ్ గా షూటింగ్స్ చేసేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. అంతేకాదు, తనకంటూ ప్రత్యేకంగా మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటాడు.
ఈ సినిమాలతో పాటుగా తారక్ మరో ఇద్దరు డైరెక్టర్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అవ్వగానే తారక్ తోనే సినిమా చేయబోతున్నాడు అని సమాచారం. ఈ త్రివిక్రమ్ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కానీ, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని తెరపైకి తీస్కుని వస్తారు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. దీని తర్వాత
తారక్ బింబిసార 2 ప్రాజెక్ట్ లో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడు. ఎప్పట్నుంచో నందమూరి అభిమానులు కళ్యాణ్ రామ్ – ఎన్టీఆర్ కలిసి నటిస్తే చూడాలని అనుకుంటున్నారు. ఈకోరిక ఈ సినిమాతో తీరే అవకాశం ఉంది. కళ్యాణ్ రామ్ ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం విన్నాడని, తారక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా ఎన్టీఆర్ వరుసగా ఐదు సినిమాలతో హల్ చల్ చేయబోతున్నాడు. మొత్తానికి ఈసారి తారక్ బాక్సాఫీస్ ని షేక్ చేసేలాగానే కనిపిస్తున్నాడు. అదీ మేటర్.

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *