సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వరుసగా 4 సినిమాలు కమిట్ అయ్యాడు మహేష్. రాబోయే రోజుల్లో ప్రిన్స్ మహేష్ బాబు బాలీవుడ్ ని ఏలడం పక్కాగానే కనిపిస్తోంది. ఇంతకీ ఏంటా నాలుగు సినిమాలు. దీనికి డైరెక్టర్స్ ఎవరూ అనేది చూసినట్లయితే
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మంచి జోష్ లో ఉన్నాడు. నిజానికి మహేష్ ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే మరో సినిమాకి కమిట్ అయిపోతూ ఉంటాడు. అయితే, కొన్ని సినిమాల నుంచీ మాత్రం ఇది బెడిసి కొడుతోంది. వంశీపైడిపల్లి తో సినిమాకి కమిట్ అయిన తర్వాత కూడా ఆ సినిమా చేయలేకపోయాడు. చాలామంది ఈవిషయంలో ప్రిన్స్ మహేష్ ని తప్పు బడుతూ వచ్చారు. కానీ, మహేష్ తీస్కున్న నిర్ణయాలు ఎంత కరెక్ట్ గా ఉంటాయో ఆ తర్వాత ఆ డైరెక్టర్స్ తీసిన సినిమాలు నిరూపించాయి. నిజానికి కథ మొత్తం రెడీ అయితేనే కానీ సినిమాకి కమిట్ అవ్వట్లేదు మహేష్.
దీనికి ఒక కారణం ఉంది. గతంలో బ్రహ్మోత్సవం సినిమా దెబ్బకి మహేష్ సినిమా సెలక్షన్స్ లో మార్పు వచ్చింది. అప్పట్నుంచీ మహేష్ ఆచి తూచి సినిమాలకి సైన్ చేస్తున్నాడు. దీనివల్ల డబుల్ హ్యాట్రిక్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం మహేష్ 4 ప్రాజెక్ట్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మహేష్.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి గుంటూర్ కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం సెట్స్ పైన ఉంది. ఇది అవ్వగానే రాజమౌళితో కలిసి ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇది కంప్లీట్ యాక్షన్ మూవీ. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచీ ఇది స్టార్ట్ అయిపోతుంది. ఈ మూవీ తర్వాత ఖచ్చితంగా మహేష్ బాబు క్రేజ్ పెరిగిపోతుంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో సూపర్ స్టార్ అవుతాడు. అందుకే, మరే సినిమాలకి సైన్ చేయట్లేదని ఖరాఖండిగా చెప్పేశాడు. కానీ, ఆ రేంజ్ లో మహేష్ తో సినిమా చేసేందుకు నిర్మాతలు ఇష్టపడుతున్నారు. రాజమౌలి సినిమా అనంతరం మా సినిమా చేయమని ఒత్తిడి తెస్తున్నారు. అందుకోసం మరో రెండు సినిమాలకి మహేష్ సైన్ చేసినట్లుగా తెలుస్తోంది.

న్యూస్ 8 లైన్స్ వెబ్ సైట్ కి ఎక్స్ క్లూజివ్ గా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత డైరెక్టర్ అట్లీతో జతకట్టబోతున్నాడు. ఈ న్యూస్ ఇప్పటివరకూ ఎక్కడా లీక్ అవ్వలేదు. మహేష్ కి అత్యంత సన్నిహిత వర్గాల నుంచీ వినిపిస్తున్న టాక్ ప్రకారం రీసంట్ గా మహేష్ బాబు అట్లీతో మీటింగ్ అయ్యిందని, అట్లీ ఒక లైన్ చెప్పాడని, పూర్తి స్క్రిప్ట్ అయ్యాక సినిమాకి సైన్ చేస్తానని మాట ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో సినిమా ఎనౌన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఖచ్చితంగా సుకుమార్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ లో క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్ ని తిరిగి పట్టాలెక్కించాలి. అందుకే, కంపల్సరిీగా సుకుమార్ తో సినిమా చేస్తాడు మహేష్. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాతే మహేష్ సినిమా ఉంటుందనేది టాక్. మొత్తానికి మహేష్ వరుసగా 4 సినిమాలు చేయబోతున్నాడనేది ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *