వాల్తేర్ వీరయ్య.. ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడే సూపర్ డూపర్ హిట్ అవుతుందని చిత్రయూనిట్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది. ఎందుకంటే, అన్ని కమర్షియల్ హంగులు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయని మెగాస్టార్ చిరంజీవి చెప్పడం, బాబీ – యూనిట్ అంతా కూడా కాన్ఫిడెంట్ గా ఉండటంతో సినిమా రిలీజ్ కి ముందే సక్సెస్ మీట్ అంటూ అందరూ మాట్లాడారు. మరి ఆ ఎక్స్ పెక్టేషన్స్ సినిమా రీచ్ అయ్యిందా లేదా అనేది చూద్దాం..

వాల్తేర్ వీరయ్య సినిమా కథేంటి

ఒక ఇంటర్నేషన్ డ్రగ్ మాఫియా డాన్ సాల్మన్ సీజర్ అంటే బాబీ సింహా ని తీస్కుని వచ్చే ఫ్లైట్ క్రాష్ అవ్వడం వల్ల ఒక లోకల్ ఏరియా పోలీస్ స్టేషన్ లో బంధించబడతాడు. రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేసే వాళ్లందరినీ చంపి అతన్ని వాళ్ల అనుచరులు విడుదల చేస్తారు. ఆ స్టేషన్ సిఐ సీతాపతి అంటే రాజేంద్రప్రసాద్ అది చూసి బాధపడతాడు. సస్పెండ్ కూడా అవుతాడు. ఎలాగైనా సరే సాల్మాన్ సీజర్ ని పట్టుకోవాలలని వాల్తేర్ వీరయ్యకి సుపారీ ఇచ్చి మరీ బ్యాంకాంక్ కి తీస్కుని వెళ్తాడు. బ్యాంకాంక్ లో అడుగుపెట్టిన వీరయ్య డ్రగ్ మాఫియా డాన్స్ ని ఎలా ఎదుర్కుంటాడు. ఆ మాఫియా టీమ్ కి వీరయ్యకి సంబంధం ఏంటి ? కథలో ఎసిపి విక్రమ్ అంటే రవితేజ ఎవరు ? ఇలాంటివన్నీ చూడాలంటే సినిమా చూడాల్సిందే…

సినిమా ఎందుకు హిట్ టాక్ వచ్చింది ?

మెగాస్టర్ చిరంజీవి సినిమా మొత్తాన్ని తన షోల్డర్స్ పై మోసాడనడంలో ఎలాంటి సందేహం లేదు. రవితేజ ఎపిసోడ్ లో కూడా మెగాస్టార్ హైలెట్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా ఉంటుంది. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్, మెగాస్టర్ పంచ్ లు చాలా సరదాగా అనిపిస్తాయి. అలాగే, బ్యాంకాంక్ ఎపిసోడ్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేసాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో లేట్ లేకుండా రవితేజ ఇంట్రో, రవితేజ – మెగాస్టర్ సీన్స్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాయి. అందుకే, హిట్ టాక్ వచ్చింది. శృతిహాసన్ కి కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ పడింది. అలాగే, సాంగ్స్ లో కూడా గ్లామరస్ గా ఉంది. ఇక మెగాస్టార్ గ్రేస్ మరోసారి మనకి పాత చిరంజీవిని గుర్తుచేస్తాడు. ఫ్యాన్స్ కి నిజంగా పూనకాలు తెప్పించేలాగనే పూనకాలు సాంగ్ ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ బాబీ చాలా టైట్ స్క్రీన్ ప్లేతో మెప్పించాడు. ఎక్కడా కూడా అనవసరపు సన్నివేశాలు పెట్టలేదు.

ఇక మైనస్ పాయింట్స్ చూసినట్లయితే


సినిమాలో సెకండ్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ ఫ్యాన్స్ కి కనెక్ట్ అవ్వవు. కానీ, అది సినిమా కథకి బలం కాబట్టి కన్సిడర్ చేయాల్సిందే. క్లైమాక్స్ కొంచెం వీక్ అనే చెప్పాలి. అక్కడక్కడ మైనస్ పాయింట్స్ వదిలేస్తే సినిమా చిరంజీవి అభిమానులకి మాత్రం పండగే. నో డౌట్. అందుకే సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది.
ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ఇది పక్కా కమర్షియల్ మాస్ వాల్తేర్ వీరయ్య అని చెప్పొచ్చు.
పరిటాలమూర్తి
రేటింగ్ 3.5 అవుట్ హాఫ్ 5

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *