నిఖిల్ హీరోగా రూపొందిన ‘కార్తికేయ 2’ ఈ నెల 13వ తేదీన థియేటర్లకు రానుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. అభిషేక్ అగర్వాల్ – విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో టీమ్ బిజీగా ఉంది. ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ నెల 13న విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో నిఖిల్ బిజీగా ఉన్నాడు. ‘మేము ఏయే ప్రదేశాలలో షూట్ చేశామో ఎక్కడ ఎన్నెన్ని కష్టాలు పడ్డామో చెబితే ఎవరూ కూడా అక్కడికి షూటింగులకు వెళ్లరు.
మేము అనుకున్న విజువల్స్ అద్భుతంగా రావడం వలన, పడిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని అనుకుంటున్నాము. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన విజువల్స్ అనకుండా ఉండలేరు” అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం షూటింగ్ లోనే కాదు. రిలీజ్ విషయంలో కూడా ఈ సినిమా నిఖిల్ ను టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఈ సినిమాకు థియేటర్లు దొరకడం లేదు. బింబిసార, సీతారామం సినిమాలు మంచి వసూళ్లతో థియేటర్లలో సందడి చేస్తున్నాయి. దాంతో ఈ రెండు సినిమాలను రన్ చేసేందుకు పంపిణీదారులు ఇంట్రస్ట్ చూపుతున్నారు. వీటితో పాటు మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా ఈ నెల 12న వస్తోంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా నేడు విడుదలయింది. నాగ చైతన్య కీలకపాత్రలో నటించిన చిత్రం కావడంతో ఈ సినిమా మెజారిటీ థియేటర్లలలో విడుదల కానుంది. అందువలన కార్తికేయ తక్కువ థియేటర్లలలోనే విడుదల కానుంది. కార్తికేయ 2పై భారీగా ఖర్చు పెట్టారు. అదంతా రావాలంటే వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమా రిలీజ్ చేయాలి. ప్రస్తుతమైతే ఆ పరిస్థితి కనిపించడం లేదు.దాంతో ఈ సినిమాకు కేవలం 12. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
Nizam: 3.50Cr
Ceeded: 1.8Cr
Andhra: 6Cr
AP-TG Total:- 11.30CR
Ka+ROI: 0.50Cr
OS – 1.00Cr
Total – 12.80CR
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 13.30 కోట్లకు పైగా వసూల్ చేయవలసి ఉంది. పెట్టిన పెట్టుబడి మాట దేవుడికెరుక బ్రేక్ ఈవెన్ అయినా ఈ సినిమా సాధిస్తుందా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.