నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బింబిసార’. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు వశిష్ఠ దర్శకుడు. టైమ్ ట్రావలింగ్ కథ, . పైగా చారిత్రక నేపథ్యం, కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సారి ఆడియన్స్ ను నిరాశపరచనని కల్యాణ్ రామ్ చెబుతూ రావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్, పాటలతో అంచనాలను భారీగా పెంచేసిన ఈ సినిమా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ, కథనం కొత్తగా ఉండటంతో ఈ సినిమాకు మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది.
దర్శకుడిగా తొలి చిత్రమైనా వశిష్ఠ బలమైన కథాకథనాలతో అద్భుతమైన వీఎఫ్ ఎక్స్ తో ఆయన ఈ కథను ఎక్కడా తడబడకుండా .. సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. కథ అనేక మలుపులు తీసుకుంటూ ఉంటుంది .. కాలాలు మారిపోతుంటాయి. కానీ ఆడియన్స్ ఎక్కడా కన్ఫ్యూజ్ కానీ స్క్రీన్ ప్లే తో ఆయన రక్తి కట్టించాడు. కళ్యాణ్ రామ్ కూడా మూడు డిఫెరెంట్ షేడ్స్ కు ప్రాణం పోశారు. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచిందనే చెప్పాలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా.. ఫొటోగ్రఫీ పరంగా .. గ్రాఫిక్స్ పరంగా .. సెట్స్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పాలి. దాంతో ఈ సినిమాకు మొదటి రోజు భారీగా కలెక్షన్స్ వచ్చాయి.
Nizam: 2.15Cr
Ceeded: 1.29Cr
UA: 90L
East: 43L
West: 36L
Guntur: 57L
Krishna: 34L
Nellore: 26L
AP-TG Total:- 6.30CR
ఈ సినిమాకు 6.30 కోట్ల షేర్, 9.40 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇంత భారీ స్థాయిలో కలెక్షన్స్ రావడం కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఇదే తొలిసారి. ఈ సినిమాకు 15.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే బ్రేక్ ఈవెన్ సాదించేందుకు 16 కోట్లకు పైగా వసూల్ చేయవలసి ఉంది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 9.70 కోట్లు వసూల్ చేయవలసి ఉంది.