హ్యాండ్సమ్ స్టార్ దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్స్ గా వచ్చిన సినిమా సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా అవ్వడం, అందులోనూ వైజయంతీ మూవీస్ ప్రొడ్యూస్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటంతో సినిమా హిట్ అవుతుందని చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. మరి ఈ సినిమా హిట్ అయ్యిందా లేదా తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

అసలు ఈ సినిమా కథేంటి :

ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ అధికారిగా పనిచేస్తుంటాడు రామ్ అంటే దుల్కర్ సల్మాన్. మానవత్వం ఉన్న మంచి మనిషి. కశ్మీర్ లో ప్రాణాలకి తెగించి మరీ పోరాడతాడు. దీంతో దేశం అంతా వాళ్ల టీమ్ పేర్లు మారు మోగిపోతాయి. అతను అనాధ అని చెప్పడంతో చాలామంది ఫ్యాన్స్ ఉత్తరాలు రాస్తారు. ఇందులో ఒక లెటర్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నీ భార్య సీత రాస్తున్న లేఖ అంటూ రాసిన ఉత్తరం రామ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అసలు ఈ సీత ఎవరు ? ఎందుకు అలా ఉత్తరాలు రాసింది ? ఈ సినిమాలో అఫ్రీన్ అంటే రష్మిక మందన ఎవరు ? ఎందుకు సీతకోసం రామ్ కోసం వెతుకుంది అనేది తెలియాలంటే మనం సినిమా చూసి తీరాల్సిందే.

ప్లస్ పాయింట్స్ ఏంటంటే

దుల్కర్ సల్మాన్ గ్లామర్, యాక్టింగ్ , బాడీ లాంగ్వేజ్ అన్నీ ఈ సినిమాకి ప్రాణం పోశాయి. ఆర్మీలో లెప్ఠినెంట్ అధికారిగా చాలా పెర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఇక మృణాల్ కి – దుల్కర్ కి మద్యలో వచ్చే సీన్స్ సినిమాకి హైలెట్. వీళ్లిద్దరి మద్యన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో , క్లైమాక్స్ కి ముందు వచ్చే సీన్స్ సినిమాకి ప్రాణం పోశాయనే చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో దుల్కర్ యాక్టింగ్ మరో లెవల్లో ఉంటుంది. సినిమాలో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వ్యూజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్. రష్మిక – సుమంత్ క్యారెక్టర్స్ కూడా సినిమాని నిలబెట్టాయనే చెప్పాలి. సినిమాలో కొన్ని ట్విస్ట్ లు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతాయి. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్.


ఫస్టాఫ్ కొద్దిగా నెమ్మదిగా సాగిందా అని అనిపిస్తుంది. అంతేకాదు, పాత్రలు పరిచయం చేసేందుకు , కథలోకి వెళ్లేందుకు డైరెక్టర్ సమయాన్ని తీస్కున్నాడు. అంతేకాదు, కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యాయి అనే ఫీలీంగ్ కలుగుతుంది.

ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే

సీతారామం అనేది ఒక ఫీల్ గుడ్ మూవీగా మిగిలిపోతుంది. ఒక కవితాత్మక ప్రేమకధగా నిలిచిపోతుంది. వీకెండ్ ఖాళీగా ఉంటే చూడండి.

రేటింగ్ 3 అవుట్ హాఫ్ 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *