టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్లలో అందరి కంటే లక్కీ కృతి శెట్టినే అని చెప్పుకోవచ్చు. తన తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే హిట్ అందుకున్న ఈ కన్నడ భామకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. స్టార్ హీరోలు సైతం ఆమె తమ సినిమాలో ఉండాలని కోరుకుంటున్నారు. ఆమె చేసిన చిత్రాలు వరుసగా సూపర్ హిట్ కావడంతో ఆమె లక్కీ మస్కట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో టాలీవుడ్ తో పాటు తమిళ పరిశ్రమలో కూడా కృతికి మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆమె ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో పాటు తమిళంలో మరో రెండు చిత్రాలు చేస్తూ ఆమె బిజీగా ఉన్నారు.
మరోవైపు తన గ్లామర్ ను మరింత పెంచుకునే యోచనలో ఆమె ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తన అందానికి మరింత మెరుగులు దిద్దుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని భావిస్తోంది. తన పెదవులు కొచెం వెడల్పుగా ఉంటాయని… అందువల్ల తన ముఖంలో కొంత అందం తగ్గిందని ఆమె భావిస్తోందట. అందువల్లే తన పెదాలు మరింత అందంగా కనిపించేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటోందట. ఇప్పటికే ఆమె ఒక డాక్టర్ ను కూడా కలిసిందట. అందమైన ఆకృతి కోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించడం ఇదే మొదటి సారి కాదు. శ్రీదేవి వంటి వారు ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోగా మరి కొంత మంది హీరోయిన్స్ బ్రెస్ట్, బకెట్స్, ఫ్యాట్ ఫ్రీ సర్జరీలను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరి చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే కృతి శెట్టి లిప్స్ మార్పు కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకుంటుందని వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. మరోవైపు, అనవసరమైన ప్రయోగాల జోలికి వెళ్లి… ఉన్న అందం పాడు చేసుకోవద్దని ఆమెకు ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. ఆమెకు కన్నడ హీరోయిన్ చేతన్ రాజ్ విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఫ్యాట్ ఫ్రీ సర్జరీ చేయించుకున్న చేతన్ రాజ్ ఆ ఆపరేషన్ వికటించి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా మరో నటి కూడా ప్లాస్టిక్ సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ తో మొహం, పెదాలు ఉబ్బిపోయిన సంగతిని గుర్తు చేస్తున్నారు. కానీ కృతి మాత్రం లిప్స్ కు సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. అయితే జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.