కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే హైఎస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా బింబిసార. ఎప్పటినుంచో సోషియో ఫాంటసీ సినిమా చేయాలని ఉందని, బింబిసారతో అది నిజమైందని ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ చెప్పిన సంగతి తెలిసిందే. మరి అనుకున్నట్లుగానే ఈ బింబిసార సూపర్ హిట్ అయ్యిందా లేదా ? ఫస్ట్ సినిమాతో డైరెక్టర్ వశిష్ట హిట్ కొట్టాడా లేడా అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

అసలు ఈ బింబిసార కథేంటి :


కళ్యాణ్ రామ్ బింబిసారుడు. క్రీ.పూ 500 సంవత్సర కాలంలో ప్రపంచాన్నే కబళించాలని రాజ్యాలపై దండెత్తుతూ అందర్నీ హడలెత్తిస్తుంటాడు. అంతేకాదు,, ఎక్కడైతే రాజ్యాన్ని వశం చేసుకున్నాడో అక్కడ యువరాణులని కూడా సొంతం చేసుకుంటాడు. దీంతో అందరికీ బింబిసారుడు అంటే హడల్. అయితే అనుకోని విధంగా బింబిసారుడు ప్రస్తుతం నడుస్తున్న టైమ్ లోకి వచ్చేస్తాడు. టైమ్ ట్రావెలింగ్ లో వచ్చిన బింబిసారుడికి ఏం జరిగింది. అతను ఎందుకు టైమ్ ట్రావెల్ చేయాల్సి వచ్చిందనేది తెలయాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే.,

కళ్యాణ్ రామ్ యాక్టింగ్ సూపర్బ్ గా ఉంది. బింబిసార రాజుగా పూర్తి న్యాయం చేశాడు. అంతేకాదు, క్యాథరిన్ అందాలు సైతం సినిమాలు ప్లస్ అనే చెప్పాలి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ని డైరెక్టర్ చాలా చక్కగా అర్ధమయ్యేలా చూపించాడు అదే సినిమాకి ప్లస్ పాయింట్. అలాగే, ఎక్కడా కన్ఫూజన్ లేకుండా సినిమాని చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. సంయుక్త మీనన్, వెన్నెల కిషోర్, వైవా హర్ష ఇలా అందరూ తమ పాత్రలకి న్యాయం చేశారు. ప్రకాష్ రాజ్ ఎంట్రీ సెకండ్ హాఫ్ కి ప్లస్ అయ్యింది. ఇంటర్వెల్ బ్యాంగ్, సినిమా క్లైమాక్స్ సినిమాని నిలబెట్టాయి. కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలెట్.

సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటంటే..,


కొన్ని పాటలు ఇరికించినట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ ని బాగా డీల్ చేసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ కొద్దిగా తడబడ్డాడని అనిపిస్తుంది. టైమ్ ట్రావెల్ పాయింట్ ని కన్విన్స్ చేసిన విధానం బాగున్నా, స్క్రీన్ ప్లే మరింత పకడ్భందీగా రాసుకోవాల్సింది.


ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే.,


వీకండ్ ఖాళీగా ఉంటే ఖచ్చితంగా బింబిసారడ్ని చూడచ్చు. అస్సలు డిస్సపాయింట్ చేయడు. అంతేకాదు, సిల్వర్ స్క్రీన్ పైన చూస్తేనే ఆ కిక్ అనేది వస్తుంది. థియేటర్లో చూడాల్సిన సినిమాగా చెప్పొచ్చు.


రేటింగ్ 3 అవుట్ హాఫ్ 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *