మనమందరం లలితా జ్యువలరీ యాడ్ చూసే ఉంటాం. ఆ యాడ్ లో గుండుతో కనిపించే అతను చెప్పే ‘డబ్బులు ఊరికే ఎవరికీ రావు’ అనే డైలాగ్ మనలన్నీ బాగా ఆకట్టుకుంది. ఆ యాడ్ లో నటించింది ఎవరో కాదు లలితా జ్యువలరీ ఓనర్ కిరణ్ కుమార్. లలితా జ్యువలరీ షాప్స్ దేశమంతా ఉన్నాయి. ఈ షాప్స్ కు ప్రచారం కల్పించాలంటే ఒక్కో దానికి 5 నుంచి 10 కోట్లు ఖర్చు చేయవలసి ఉంటుంది. అలా
పాన్ ఇండియా వ్యాప్తంగా యాడ్స్ చేయాలంటే దాదాపు 200 కోట్లకు పైగానే కేటాయించవల్సి ఉంటుంది. ఇంత భారీ బడ్జెట్ అవసరమా? అనే ఉద్దేశంతో కిరణ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. దాంతో 200 కోట్లు మిగలడమే కాకుండా లలితా జ్యువలరీకి పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.
ఇదే ఫార్ములాను ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ అరుళ్ పట్టుకున్నాడు. శరవణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ అయిన శరవణన్ తమ కంపెనీ కోసం ఎన్నో యాడ్స్ చేశారు. ఆ యాడ్స్ లో ఆయన స్వయంగా నటిస్తూనే మరో ఇద్దరు హీరోయిన్స్ ను తీసుకునేవాడు. యాడ్ ఫిలిం షూటింగ్ కు ఓ పేరున్న డైరెక్టర్ ను తీసుకునేవాడు. యాడ్ మేకింగ్, దర్శకుడు, హీరోయిన్స్ పారితోషికాలు, ప్రొడక్షన్ కాస్ట్ కలుపుకుంటే మొత్తం 10 కోట్లకు పైగా ఖర్చు అయ్యేది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన షాప్స్ ప్రమోషన్స్ కోసం ఆయన 400 కోట్లకు పైగా ఖర్చు పెట్టవలసి వస్తోంది. అంతేకాకుండా పన్నులు రూపంలో ఐటీ కూడా భారీగానే కట్టవలసి వచ్చేది. దాంతో శరవణన్ ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. ఐటీ సమస్యలే గాక తమ బ్రాండ్స్ కు కావలసినంత ప్రమోషన్స్ కోసం ఆయన హీరోగా నటించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గర అయ్యేందుకు ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ ఊర్వశి రౌతాలను తీసుకున్నారు. ఇందుకోసం ఆమెకు 20 కోట్లకు పైగా చెల్లించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హరీశ్ జయరాజ్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు ముందుగా 50 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. కానీ కరోనా కారణంగా నెంబర్ ఆఫ్ మేకింగ్ డేస్ పెరగడంతో బడ్జెట్ 80 కోట్లు దాటింది. విపరీతమైన ట్రోలింగ్ ను ఎదురుకున్న ఈ సినిమా గత నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అందరూ ఊహించినట్లు గానే డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ కాకపోయినా శరవణన్ గురించి దేశ వ్యాప్తంగా తెలిసింది. ఆ గుర్తింపు తన వ్యాపారానికి ఎంతో ఉపయోగపడుతుంది. వేరే స్టార్ లకు రెమ్యునిరేషన్ ఇవ్వకుండా శరవణన్ ఫేస్ తోనే బ్రాండింగ్ ప్రమోషన్స్ జరగనున్నాయి. ఇక ఇప్పుడు చెప్పండి ‘ది లెజెండ్’ హీరోది మాస్టర్ బ్రెయిన్ గాక ఇంకా ఏమని అనాలో!!