బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 అయిపోయింది. మరి సీజన్ 6 ఎప్పుడు అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే, ఇది సీజన్ 6గా వస్తుందా లేదా సీజన్ 1 గా రాబోతోందా అనేది ఇప్పుడు ఆసక్తికరం. అదేంటి సీజన్ 1 అని అనుకుంటున్నారా… ? యస్ సీజన్ 1 అదే ఓటీటీలో వచ్చేది బిగ్ బాస్ తెలుగు సీజన్ 1. అది సీజన్ 6 కాదు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పైన నాగార్జున ఎనౌన్స్ చేసినట్లుగా రెండు నెలల్లో రాబోయే బిగ్ బాస్ సీజన్ ఓటీటీలో మాత్రమే వస్తుంది. కానీ , ఈ ఓటీటీ బిగ్ బాస్ అనేది ఎలా ఉండబోతోంది అనేది ఇప్పటివరకూ అయితే అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.ఇప్పుడున్న సీజన్ 5 సెట్స్ ని కాస్త మార్పులు చేర్పులు చేసి సీజన్ 1 గా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన 15మంది సెలబ్రిటీలు ఎవరు అన్నది త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈ సీజన్ అనేది కంప్లీట్ గా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుంది. టెలివిజన్ ప్రేక్షకులకి వస్తుందా రాదా అనేది చూడాలి. అయితే, దీనికి నాగార్జున యాంకరింగ్ చేస్తారా ? లేదా ? అనేది మాత్రం సస్పెన్స్. అయితే, ఈ ఓటీటీ షోకి మాత్రం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మొదటి పేరు సీజన్ 1 విజేత అయిన శివబాలాజీ , అలాగే అదే సీజన్ లో ఎంటర్ టైన్ చేసిన నవదీప్. వీళ్లిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఓటీటీలో కంటెంట్ కాబట్టి కూల్ గా వీరిద్దరే ఉండే అవకాశం ఉంది.
నిజానికి హిందీలో ఓటీటీలో చేసిన బిగ్ బాస్ కి అంత ఆదరణ లభించలేదు. కరణ్ జోహార్ దీనికి యాంకరింగ్ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి, తెలుగులో ఏదైనా ప్లాన్ చేస్తారా అనేది ఆసక్తికరం. తెలుగులో ఫస్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసిన తర్వాత మరుసటి రోజున టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఈ షో అనేది ఎలా ఉండబోతోందనేది ఇప్పుడప్పుడే ఎవ్వరూ ఊహించలేరు. అంతేకాదు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 తర్వాత సీజన్ 6 ని కూడా వచ్చే సంవత్సరం ముందుగానే తెచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. జూన్, జులై నెలల్లోనే ఈ సీజన్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అదీ మేటర్.