దర్శకధీరుడు రాజమౌళి తెరపై ఆవిష్కరించిన అద్భుత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మాగ్నమ్ ఓపస్ చిత్రానికి ఏ మాత్రం భయపడకుండా నిర్మాత దానయ్య 450 కోట్లకు పైగా ఖర్చు చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి తొలిసారి నటించిన ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి మెయిన్ వార్తలలో నిలుస్తూనే ఉంది. షూటింగ్ పార్ట్ కు 350 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన నిర్మాత కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులకు 75 కోట్లు, ప్రమోషనల్ ఈవెంట్స్ కు మరో 25కోట్లు ఖర్చు పెట్టినట్లు సినీ వర్గాలలో చర్చ జరగడం విశేషం. వాస్తవానికి ఈ సినిమాని జనవరి 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కోవిడ్ ఉగ్రరూపం దాల్చడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ఈ మూవీ రిలీజ్ ని మేకర్స్ అర్థాంతరంగా వాయిదా వేయడంతో సినీ అభిమానులు నిరాశలో మునిగిపోయారు.
ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రివీల్ చేసారు. ఈ సినిమాని చూసిన దుబాయి సెన్సార్ సభ్యుడు ఉమైర్ సందు ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ తన రివ్యూని ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో నటించిన స్టార్స్ రెమ్యునిరేషన్ల గురించి ఆయన తనవద్ద ఉన్న సమాచారాన్ని బయటపెట్టాడు. ఈ సినిమాలో హీరోలుగా నటించిన చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరూ 55 కోట్ల రెమ్యునిరేషన్ తీసుకున్నారట. వీరిద్దరికి నిర్మాత చెరో 40 కోట్లు ఇచ్చినట్లు ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. సినిమా రిలీజ్ అయిన తరువాత హీరోలిద్దరికీ మరో 30 కోట్లు ఇచ్చేందుకు నిర్మాత ఒప్పందం చేసుకున్నాడట.
ఇక ఈ సినిమాలో వారి గురువుగా కీలకపాత్రలో నటించిన అజయ్ దేవగణ్ ఏకంగా 35 కోట్ల పారితోషకాన్ని అందుకున్నట్టు సందు వెల్లడించాడు. ఇప్పటికే ఆయనకు మొత్తం రెమ్యునరేషన్ ని నిర్మాత ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో చరణ్ కు జోడిగా నటించిన అలియా భట్ కు రెమ్యునిరేషన్ గా 9 కోట్లు ఇచ్చారట. ఆమె ఈ సినిమాలో 20 నిమిషాలు మాత్రమే కనిపించనున్నారు. 20 నిమిషాల పాత్రకే ఈ రేంజ్ పారితోషికం ఇవ్వడం బాలీవుడ్ వర్గాలను కూడా షాక్ కు గురి చేసింది. ఈ సినిమా నిర్మాణంలో కూడా పాలు పంచుకున్న రాజమౌళి తన పారితోషికంగా 100 కోట్లు తీసుకున్నట్లు సందు పేర్కొన్నారు. ఇక ఈ సినిమా విడుదలై లాభాలు వస్తే మాత్రం రాజమౌళి అదనంగా మరో 50 కోట్లు తీసుకోనున్నట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.RRR
రిలీజ్ పలు ధపాలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో రెమ్యునిరేషన్ లో కోత పడటం ఖాయం కనుక ఈ మూవీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా థియేటర్లలో విడుదలైతేనే మంచిదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితులు సర్దుకుంటే ఈ సినిమాని మార్చి 18న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అది మ్యాటర్