స్టైలిష్ స్టార్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన పుష్ప సినిమా వీకండ్ కలక్షన్స్ దుమ్మురేపుతోంది. కానీ, మండే నుంచీ సినిమాకి కాస్త కలక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఏపిలో బెనిఫిట్ షోలు పూర్తిస్థాయిలో లేకపోవడం అనేది కొద్దిగా మైనస్ అయితే, టిక్కెట్ రేట్ల విషయంలో కూడా ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ లేదు. హైకోర్డ్ తీర్పు ఇచ్చినా కూడా ఏ జిల్లాకి ఆజిల్లా జాయింట్ కలక్టర్స్ మాత్రమే దీనికి కావాల్సిన పర్మీషన్స్ ని ఇస్తున్నారు. ఈ గోల పక్కనబెడితే, సినిమా కలక్షన్స్ 200కోట్ల రేసులో పరుగులు తీస్తోంది. ఇప్పుడు పుష్ప ఇచ్చిన ఊపులో భారీ బడ్జెట్ సినిమా ట్రిబుల్ ఆర్ రాబోతోంది. జనవరి 7వ తేదిన టార్గెట్ చేస్కుని రీలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి హాలిడేస్ ని గ్రాబ్ చేయాలని చూస్తున్నారు. ఈనేపధ్యంలో అసలు ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్ అనేవి ఎంతవరకూ ప్లస్ అవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు పుష్ప సినిమాకి కూడా ఇదే మైనస్ అయ్యింది. యాక్షన్ సీన్స్, స్మిగ్లింగ్ నేపథ్యంలో సాగే కధ, సీరియస్ గా ఉండే హీరో క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా సినిమాలో సరదాని మిస్ చేసింది. అంతేకాదు, ఒకేరకమైన యాసని సినిమా మొత్తం వాడటంతో కొన్ని ప్రాంతాల ప్రజలకి కొన్ని డైలాగ్స్ సైతం అర్ధం కాలేదు. ఇలాంటి నేపథ్యంలో పుష్పకి కొద్దిగా మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా కూడా కలక్షన్స్ మాత్రం తగ్గేదే లే అన్నట్లుగానే ఉన్నాయి. మరో వీకండ్ అయితే, సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్లే అవుతుంది. నిర్మాతలు సేఫ్ గా ఉంటే, సెకండ్ పార్ట్ ని మరింత స్ట్రాంగ్ గా రిలీజ్ చేస్కోవచ్చు. అప్పటికి కరోనా పరిస్థితులు, ఒమిగ్రామ్ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో కానీ, ఇప్పుడు మాత్రం ఇదే ఊపులో మరో 6నెలల్లో సినిమా వస్తే మాత్రం తిరుగుండదు. సేమ్ టు సేమ్ కలక్షన్స్ ని తెచ్చిపెట్టేస్తుంది.
ఇక పుష్ప ఇచ్చిన ఊపు ట్రిబుల్ ఆర్ కి బాగా ప్లస్ అయ్యేలాగానే కనిపిస్తోంది. ఓపెనింగ్ కలక్షన్స్ కి తిరుగుండదు. ఎందుకంటే, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ పోటీ పడి మరీ సీట్స్ ని ఆక్యూపై చేసేస్తారు. మరోవైపు ఓవర్సీస్ లో కూడా సినిమాకి రాజమౌళి కారణంగా బ్రహ్మరధం పట్టేస్తారు. కాబట్టి శుక్ర, శని , ఆదివారం మూడు రోజులు కలక్షన్స్ కుమ్మేస్తారు. ఆ తర్వాత జనవరి 10వ తేది నుంచీ 12వ తేది వరకూ అంటే మూడు రోజులు పాటు సినిమాకి అగ్నిపరీక్షే. అవన్నీ వర్కింగ్ డేస్ కాబట్టి , సంక్రాంతికి మళ్లీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. అంటే నెక్ట్స్ వీక్ కలక్షన్స్ ని కూడూ గట్టిగా కుమ్మేస్తుంది ఈ సినిమా. అయితే, 14వ తేదిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి, బాలీవుడ్ లో కొద్దిగా గట్టి దెబ్బే తగిలేలా కనిపిస్తోంది. హ్యూజ్ కలక్షన్స్ ని రాబట్టుకోవాలంటే మాత్రం ట్రిబుల్ ఆర్ సినిమాకు రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. మరి ఈ టైమ్ లో ఎంత కలక్ట్ చేస్తుందనేది చూడాలి. ఫస్ట్ వీక్ లోనే సినిమా మిక్స్ డ్ టాక్ వస్తే మాత్రం సెకండ్ వీక్ వేరే సినిమాలకోసం ఆడియన్స్ వెయిట్ చేస్తారు. రాధేశ్యామ్ , బంగార్రాజు తెలుగులో ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా ట్రిబుల్ ఆర్ కి కొద్దిగా కష్టంగానే అవుతుంది. ఇంత టైట్ షెడ్యూల్ లో ట్రిబుల్ ఆర్ ఎంత కలక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.