యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాతో, దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. నితిన్ సరసన నాయికగా కృతిశెట్టి .. కేథరిన్ నటించిన ఈ సినిమా, అవినీతి రాజకీయాలను టచ్ చేస్తూ సాగుతుంది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో నితిన్ మాట్లాడుతూ .. “ఈ సినిమాలో నా ఫైట్స్ .. డాన్స్ చాలా కొత్తగా ఉంటాయి. అంజలితో చేసిన ఐటమ్ సాంగ్ కి ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది.
ఈ సినిమాకి శేఖర్ మాస్టర్.. జానీ మాస్టర్.. జీతూ మాస్టర్.. శోభి మాస్టర్ కొరియోగ్రఫీని అందించారు. ప్రతి సాంగ్ కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. శేఖర్ మాస్టర్ .. జానీ మాస్టర్.. శోభి మాస్టర్ .. జీతూ మాస్టర్ అందరు కూడా నా సినిమాలతోనే టాలీవుడ్ కి పరిచయమయ్యారు. తమ ఫస్టు సాంగ్ ను నాతోనే చేశారు. వాళ్లందరితో కలిసి ఈ సినిమా చేయడం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఎక్కడ కూడా అమ్మ రాజశేఖర్ ప్రస్తావన తీసుకురాకుండా జాగ్రత్తపడ్డాడు. అమ్మ రాజశేఖర్ గురించి ప్రశ్నలు అడిగినా నితిన్ ఆ ప్రశ్నలకు జవాబు దాట వేయడం గమనార్హం.
నితిన్ కు తాను డాన్స్ నేర్పించానని కానీ ఆయన నన్ను మోసం చేశాడని అమ్మ రాజశేఖర్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ”నితిన్ కి కనీస మర్యాద కూడా తెలియకుండా పోయింది. ఒరేయ్ నితిన్ నేను నిన్ను చాలా నమ్మాను. కానీ నువ్వు ఇలా చేసావు” అంటూ నితిన్ పై ఫైర్ అయ్యారు. కానీ నితిన్ ఇప్పటివరకు ఎక్కడ కూడా అమ్మ రాజశేఖర్ తనకు డాన్స్ నేర్పించారని చెప్పలేదు. దీనికి తోడు మిగిలిన మాస్టర్స్ వల్లే తన డాన్స్ స్టెప్స్ కొత్తగా ఉంటాయని చెప్పడంతో అమ్మ రాజశేఖర్ కు నితిన్ పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారంటూ ఫిలిం వర్గాలలో చర్చ జరుగుతోంది. రాజశేఖర్ పేరును కూడా ప్రస్తావించేందుకు నితిన్ కు ఇష్టం లేదని టాక్ నడుస్తోంది.