సర్కార్ వారి పాట
హిట్టా ? ఫట్టా ?
ఎన్నో అంచనాలతో పక్కా కమర్షియల్ హంగులతో రిలీజైంది సర్కార్ వారి పాట సినిమా. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి సినిమా పండగనే చెప్పాలి. వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ కి మరి ఈ సినిమా హిట్టించిందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం..
అసలు ఈ సినిమా కథేంటి ?
బ్యాంక్ అప్పుడు కట్టలేక పరువుకోసం ప్రాణాలు తీస్కుంటారు మహేష్ తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచీ ఈ విషయం మహీని కలిచి వేస్తుంది. ఒక అనాధగా మిషనరీ స్కూల్ లో చదువుకున్న మహీ పెద్దవాడై అమెరికాలో అందరికీ అప్పులిస్తూ ఫైనాన్స్ కంపెనీని కార్పొరేట్ స్టైల్లో నడుపుతుంటాడు. ఆ సమయంలో పరిచయం అవుతుంది కళావతి. అమాయకంగా తన దగ్గరకి వచ్చి అప్పుడు అడుగుతుంది. దీంతో కళావతి మాయ మాటలకి పడిపోతాడు మహి. ఆ తర్వాత కళావతి పెద్ద గేమర్ అని తనతో కూడా గేమ్ ఆడిందని తెలుసుకుంటాడు. తన అఫ్పుడు తనకి ఇచ్చేయమని అఢిగితే కళావతి మహీకి థంకీ ఇస్తుంది. తన తండ్రి రాజేందర్ తో ఫోన్ చేయించి మరీ బెదిరిస్తుంది. దీంతో ఈ విషయం రాజేందర్ తో తేల్చుకోవడానికి ఇండియా వస్తా మహి. మరి రాజేందర్ దగ్గర వాళ్ల కూతురు తన దగ్గర తీస్కుని అప్పు వసూలు చేయడానికి చూస్తాడు. వైజాగ్ లోనే పెద్ద తలకాయల్లో ఒకడైన రాజేందర్ కి మహీ పెద్ద సమస్యగా మారతాడు. తను వచ్చింది కేవలం తన కూతురు చేసిన అప్పుకోసం కాదని తెలుసుకుంటాడు. అసలు ఈ కథలో బ్యాంక్ మేనేజర్ నదియా ఎవరు ? నదియాకి మహేష్ కి గల సంబంధం ఏంటి ? చివరకి రాజేందర్ దగ్గర అప్పు వసూలు చేశాడా లేదా అనేది వెండితెరపై చూడాలి.
సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే.,
మహేష్ బాబు యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ అని కన్ఫార్మ్ గా చెప్పేయచ్చు. ఎందుకంటే, అంత గొప్పగా , ఈజీగా యాక్ట్ చేశాడు మాహేష్. తనకి ఇలాంటి క్యారెక్టర్స్ లో నటించడం చాలా సులువు అని మరోసారి ప్రూవ్ చేశాడు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పరుశురామ్ టేకింగ్ క్వాలిటీగా ఉన్నాయి. ఫస్ట్ నుంచీ కూడా డైరెక్టర్ పరుశురామ్ మహేష్ ని హైలెట్ చేస్తూ చూపిస్తాననే చెప్తూనే వచ్చాడు. అనుకున్నట్లుగానే మహేష్ ఎలివిషన్ షాట్స్ అనేవి హైలెట్ చేశాడు కూడా. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆర్టిస్టుల విషయంలో కానీ, లొకేషన్స్ కానీ ఎక్కడా కాంప్రైమైజ్ అవ్వకుండా తీశారు. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ సినిమాకి హైలెట్. సాంగ్స్, ఫైట్స్ , యాక్షన్ సినిమాని నిలబెట్టాయి.
మైనస్ పాయింట్స్ చూద్దాం..
ప్రధానమైన మైనస్ ఏంటంటే, కథ లేకపోవడం. సరైన పాయింట్ ఉన్నా కూడా కథని అల్లుకోవడంలో డైరెక్షన్ టీమ్ ఫెయిల్ అయ్యింది. అసలు ఎమోషన్ ని పక్కనబెట్టేసి కొసరు పైన ఎక్కువగా సీన్స్ నడుస్తాయి. లెంగ్తీ సీన్స్ సెకండ్ హాఫ్ బొర్ కొట్టించేశాయి. అంతేకాదు, వాస్తవానికి దూరంగా కొన్ని సీన్స్ తీయడం వల్ల ఆడియన్స్ ఆ నాచురాలిటీని ఫీల్ అవ్వలేకపోయారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంక్ కి వచ్చి బ్రహ్మాజీని బెదిరించి నోటీస్ ఇప్పించే సీన్ వాస్తవానికి దూరంగా ఉంటుంది. అలాగే, డిల్లీ వెళ్లి రాజేందర్ తన పరపతిని చూపించే సీన్, లారీతో వచ్చి విద్వంసం చేస్తూ నోటీస్ ఇచ్చే సీన్ కొద్దిగా ఓవర్ అనిపిస్తుంది. స్టోరీ లైన్ మంచిగా రాస్కున్నా కూడా కథని స్క్రీన్ ప్లేతో, సీన్స్ తో అల్లడంలో ఫెయిల్ అయ్యారు. మహేష్ బాబు, సుబ్బరాజు, కీర్తిసురేష్ చేసిన సెకండ్ హాఫ్ కామెడీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అసలు విషయమే లేకుండా హీరోయిన్ లో వచ్చిన మార్పు కూడా అంత ఆసక్తిగా లేదు.
ఓవర్ ఆల్ గా చెప్పాలంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం సోసోగా అనిపిస్తుంది. వీకండ్ ఖాళీగా ఉంటే చూడండి.
పరిటాల మూర్తి ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ హాఫ్ 5