ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్మీ మరో అద్భుతమైన ఆవిష్కరణను నెలకొల్పనుంది. ప్రపంచంలోనే మొదటి ఇన్నోవేటివ్ ఫీచర్స్‌ను రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌లో ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రాబోతున్న కొత్త ఫీచర్లను రియల్మీ అధికారిక యూట్యూబ్‌లో ఖాతాలో సోమవారం రోజున ప్రత్యక్ష ప్రసారం చేసింది. రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఫోటోగ్రఫీ, కమ్యూనికేషన్ విషయాల్లో వరల్ట్ ఫస్ట్ ఇన్నోవేషన్స్‌గా నిలుస్తోందని రియల్మీ పేర్కొంది.
రియల్మీ జీటీ 2 ప్రో డిజైన్ ఫీచర్
ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ విషయంలో పేపర్ నుంచి ప్రేరణ పొందినట్లు కంపెనీ వెల్లడించింది. తన కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను పేపర్ టెక్ మాస్టర్ డిజైన్ కంపెనీ అభివర్ణించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌కోసం ప్రఖ్యాత జపనీస్ ఇండస్ట్రియల్ డిజైనర్ Naoto Fukasawa కంపెనీతో రియల్మీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్ SABIC ద్వారా బయో-పాలిమర్ మెటీరియల్‌తో నిర్మించనుంది. దీని ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌లో ప్లాస్టిక్ నిష్పత్తి 21.7 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గనుంది.
రియల్మీ జీటీ 2 ప్రో కెమెరా ఫీచర్
రియల్మీ నుంచి రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్‌లో భాగంగా రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు న్యూ అల్ట్రావైడ్ సెన్సార్‌ను కూడా అందించింది. ఈ కొత్త సెన్సార్ 150-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూస్‌తో రానుంది. ప్రైమరీ వైడ్ సెన్సార్‌లోని 89-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ కంటే 273 శాతం ఎక్కువగా ఉంది. ఈ “అల్ట్రా-లాంగ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్ట్”తో ఫోటోలను మరింత ఆకర్షణీయంగా తీయవచ్చుని రియల్మీ పేర్కొంది.
రియల్మీ జీటీ 2 ప్రో కమ్యూనికేషన్ ఫీచర్
కొత్త రియల్మీ జీటీ 2 ప్రోలో యాంటెన్నా అర్రే మ్యాట్రిక్స్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి “అల్ట్రా వైడ్ బ్యాండ్ హైపర్‌స్మార్ట్ యాంటెన్నా స్విచింగ్” సిస్టమ్‌ను కలిగి ఉంది. దీంతో అన్ని దశల నుంచి ఒకే సిగ్నల్ బ్యాండ్లకు మద్దతు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఉత్తమ నెట్వర్క్ బ్యాండ్‌ని ఎంచుకోవడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది.యాంటెన్నా స్విచింగ్ సిస్టమ్‌తో పాటు, రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో వైఫై సామర్థ్యాన్ని పెంచేందుకు, 360-డిగ్రీ ఎన్ఎఫ్సీ మద్దతుతో రానుంది.