నటీనటులు – రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్, చమ్మక్ చంద్ర, ముక్తార్ ఖాన్, రామరాజు, సమీర్, సీవీఎల్ నరసింహారావు, అనంత్ తదితరులు

టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – జేపి, మ్యూజిక్ – సందీప్ కనుగుల, డీవోపీ – నిమ్మల జైపాల్ రెడ్డి, స్టంట్ – శంకర్, ఆది, కో ప్రొడ్యూసర్ – కమల్ హాసన్ పాత్రుని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – జానకి రామ్ పమరాజు, ప్రొడ్యూసర్ – రాజ్ భీమ్ రెడ్డి, దర్శకత్వం – ఆర్ రాజశేఖర్ రెడ్డి.

సున్నిత‌మైన స‌బ్జెక్టుతో తెర‌కెక్కిన “ది ఇండియన్ స్టోరి” అనే సినిమా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుందోన‌ని అంతా ఉత్కంఠ‌గా ఎదురుచూశారు. రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఇండియన్ స్టోరి సినిమా మే 3 (శుక్ర‌వారం) థియేటర్స్ లోకి వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తూ హీరోగా నటించారు. దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి రూపొందించారు. ఇంత‌కీ ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

కథ: ఓ హిందూ వర్గానికి లీడ‌ర్ శ్రీరామ్ (రామరాజు), ముస్లిం వర్గ నాయ‌కుడు కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్). ఈ ఇద్దరు నాయకులు ప్రజల్ని రెచ్చగొడుతూ పరస్పరం దాడులు చేసుకుంటుంటారు. విశాఖ నుంచి వచ్చిన రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి)కి ఓ విషయంలో ఫేకు (చమ్మక్ చంద్ర) అనే స్నేహితుడు హెల్ప్ చేస్తాడు. సాయం చేస్తానంటూ స్నేహితుడే మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. కబీర్ ఖాన్ ను శ్రీరామ్ వర్గం చేసిన హత్యాయత్నం నుంచి రెహమాన్ కాపాడతాడు. కబీర్ ఖాన్ బలవంతం మీద అతని వర్గంలో రెహమాన్ చేరతాడు. ఆప్తుడిగా మారిన రెహమాన్ ను కబీర్ ఖాన్ హత్య చేయాలని అనుకుంటాడు. ఇందుకు కారణం ఏంటి? జర్నలిస్ట్ రాజ్ రెహమాన్ గా ఎందుకు మారాడు? అతను కబీర్ ఖాన్ వర్గంలోకి ఎందుకు చేరాడు? కబీర్ ఖాన్ కూతురిలా చూసుకునే ఆయేషాతో రెహమాన్ ప్రేమ సక్సెస్ అయ్యిందా? లేదా? మతం పేరుతో ప్రజల్ని విడదీసిన ఈ ఇద్దరు నాయకుల ప్లాష్ బ్యాక్ ఏంటి? కబీర్ ఖాన్, శ్రీరామ్ పుట్టించే మత విద్వేషాల నుంచి సమాజాన్ని రెహమాన్ ఉరఫ్ రాజ్ ఎలా కాపాడాడు అనేది సినిమా క‌థ‌.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌: ఈ సినిమాలో హీరో రాజ్ భీమ్ రెడ్డి కథకు, తన పాత్రకు స‌రిగ్గా సూట‌య్యాడు. భారీ హంగులకు పోకుండా ఫ‌ర్‌పెక్టుగా చేశాడు. రాజ్ భీమ్ రెడ్డి ఫైట్స్ సినిమాకే హైలైట్. యాక్షన్ సీక్వెన్స్‌లను బాగా తెరకెక్కించారు. ఫేకుగా చమ్మక్ చంద్రకు తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. ఉన్నంత సేపూ నవ్విస్తూనే ఉన్నాడు చమ్మక్ చంద్ర. అలాగే హీరోయిన్ జరా ఖాన్ పర్ ఫార్మెన్స్ ఆక‌ట్టుకుంది. శ్రీరామ్ గా రామరాజు, కబీర్ ఖాన్ గా ముక్తార్ ఖాన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నిక‌ల్ విభాగం: టెక్నికల్ గా “ది ఇండియన్ స్టోరి” సినిమా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఫైట్స్.. సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవ‌చ్చు.

విశ్లేష‌ణ‌: సున్నిత‌మైన స‌బ్జెక్టుతో సమాజానికి మెసెజ్ చెప్పేలా తెర‌కెక్కించ‌డం అంత ఈజీ కాదు. అలాంటి స‌బ్జెక్టును ఫ‌ర్‌ఫెక్టుగా డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన మూవీ ఇది. త‌మ స్వార్థ రాజ‌కీయాల కోసం మ‌తం రంగు పులుముకుని, మ‌త‌విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతూ నాయ‌కులు ఎదుగుతున్న వారి బండారాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసిన చిత్ర‌మిది. పొలిటిక‌ల్ లీడ‌ర్లు తమ స్వార్థంతో ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెడుతుంటారు.. వారి ఉచ్చులో చిక్క‌కండి అంటూ హెచ్చ‌రించి ఓ భారీ మెసెజ్‌ను ఇచ్చింది. కబీర్ ఖాన్, శ్రీరామ్ క్యారెక్టర్స్ పరిచయంతో సినిమా మొదలవుతుంది. రెహమాన్ (హీరో రాజ్ భీమ్ రెడ్డి) వైజాగ్ నుంచి రావడం, అతను ఫ్రెండ్ ఫేకు (చమ్మక్ చంద్ర)ను కలవడం, వాళ్లిద్దరు బంగారు బిస్కెట్లను అమ్మేందుకు పడే పాట్లతో సరదాగా సినిమా టేకాఫ్ అవుతుంది. కబీర్ ఖాన్ ను హత్య నుంచి రెహమాన్ కాపాడటంతో సినిమా మ‌రింతా ఉత్కంఠగా మారుతుంది. ఆస్పత్రిలో నర్సుతో చమ్మక్ చంద్ర చేసే కామెడీ, హీరోకు రాజ్ భీమ్ రెడ్డికి, చమ్మక్ చంద్రకు మధ్య వచ్చే సీన్స్ బాగా నవ్విస్తాయి. హీరో హీరోయిన్స్ మధ్య కూడా ఒక చిన్న ఎమోషనల్ లవ్ స్టోరీ చూపించారు. జర్నలిస్ట్ గా ఉన్న రాజ్ రెహమాన్ గా ఎందుకు మారాల్సి వచ్చింద‌నే విష‌యాన్ని డైరెక్ట‌ర్ ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఒకవైపు కామెడీగా ఉంటూనే కథలో సీరియస్ నెస్ కంటిన్యూ అయ్యేలా చూసుకున్నాడు దర్శకుడు. మతం పేరుతో ప్రజలకు తప్పుడు సందేశం వెళ్లకుండా కేవలం తాము చెప్పదల్చుకున్న పాయింట్ ను ఈ సినిమాలో చూపించారు నిర్మాత రాజ్ భీమ్ రెడ్డి, దర్శకుడు. మతం పేరుతో మనను విడదీస్తున్న వారి కుట్రలను గమనించాంటూ మంచి సందేశాన్నిచ్చిందీ సినిమా.

రేటింగ్: 3.25 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *