మహేష్ బాబు ఫ్యాన్స్ కి నిజంగా ఇది అద్దిరిపోయే అప్డేట్ర్… ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్ ఈ సినిమాకోసం ప్లాన్ చేస్తున్నారు. దీనంతటికి కారణం నెక్ట్స్ రాజమౌళితో మహేష్ సినిమా ఉండటమే. అయితే, ఇప్పుడు రాజమౌళి సినిమా గురించి ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా అని రాజమౌళి చెప్పకనే చెప్పాడు. అప్పట్నుంచీ ఈ సినిమా ఎలా ఉండబోతోందని మహేష్ ఫ్యాన్స్ ఆరాలు తీస్తునే ఉన్నారు. ప్రస్తుతం మనకి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉండబోతున్నాయి.

హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని ప్లాన్ చేశాడట జక్కన్న. దీనికోసమే ప్రస్తుతం ఆర్టిస్టుల వేటలో కూడా ఉన్నట్లు టాక్. హాలీవుడ్ నుంచీ కొంతమంది స్టైలిష్ యాక్టర్స్ ని రంగంలోకి దింపుతున్నాడు. అంతేకాదు, ఈసినిమా బడ్జెట్ కూడా 1000కోట్లు దాటబోతోంది. మొత్తం 30 భాషల్లో సినిమాని ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా మార్కెటింగ్ కానీ, మేకింగ్ కానీ ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి. మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ ఏంటంటే, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ సినిమాలో మహేష్ తో కలిసి యాక్ట్ చేయబోతున్నాడట. దీనికి సంబంధించి ఇప్పటికే అమీర్ ఖాన్ డేట్స్ ని బ్లాక్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. 2024 ఏప్రిల్ నెల నుంచీ జక్కన్న ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ ప్లాన్ చేస్తున్నాడు. 90రోజులు రిహార్సల్స్ తర్వాతే సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. అంతేకాదు, ఈసినిమా కోసం కోకాపేటలో భారీ సెట్ వర్క్ ప్లాన్ చేశాడట జక్కన్న. ఇదంతా విన్న ఫ్యాన్స్ ఇది నిజమేనా జక్కన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ ల సినిమా అతి త్వరలోనే షూటింగ్ ని ఫినిష్ చేస్కుంటుంది. దీని తర్వాత మహేష్ బాబు రాజమౌళి వర్క్ షాప్ లో జాయిన్ అవుతాడు. ఇక్కడే ఆర్టిస్టులందరూ గేదర్ అవుతారని, వాళ్లతో భారీ సీక్వన్స్ రిహార్సల్స్ అయిన తర్వాత సెట్స్ పైకి వెళ్తారట. ఇంకో మేటర్ ఏంటంటే, ఈసినిమాకోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ ని ఇప్పటికే హైయర్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆస్ట్రేలియా నుంచీ మేకప్ మాన్స్ ని స్పెషల్ స్టైలిష్ డిజైనర్స్ ని రప్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో , ముంబైలో , యూరప్ లో ప్లాన్ చేయబోతున్నారు. లొకేషన్స్ కోసం ఇప్పట్నుంచే భారీ సెర్చింగ్ జరుగుతోంది. పూర్తి వివరాలు ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి రాజమౌళి స్వయంగా చెప్పబోతున్నాడు. అప్పుడే సినిమా కథ గురించి హింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాదు, మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేయబోతున్నాడో ముందుగానే చెప్పేస్తే ఫ్యాన్స్ భారీ అంచనాలు లేకుండా ఉంటాయని, అందుకే ముందుగానే స్టోరీ లైన్ చెప్పబోతున్నారనేది టాక్. ఇలా ప్రతిసారి జక్కన్న ప్రెస్ మీట్ లో అంచనాలు లేకుండా చేస్తాడు. ఆ తర్వాత తన మేకింగ్ ద్వారా సినిమాపై అంచనాలు పెంచుతాడు. దీంతో అందరూ సినిమా కోసం వెయిట్ చేస్తారు. ఇది జక్కన్న స్టైల్. ఈసారి మహేష్ బాబుతో భారీగా మార్కెట్ కొట్టాలని చూస్తున్నారు. అంతేకాదు, హాలీవుడ్ తరహాలో సినిమా మేకింగ్ ఉండబోతోందని, ఈ సినిమా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని అమాంతం పెంచబోతోందని చెప్తున్నారు. అదీ మేటర్.

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *