హాయ్ హలో వెల్ కమ్ టు న్యూస్ 8 lines
యంగ్ రెబల్ స్టార్ నుంచీ నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ సినిమాలు ఇప్పుడు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. సలార్ అంటూ మాస్ యాక్షన్ ని చూపిస్తున్న ప్రభాస్, ప్రాజెక్ట్ కె తో సైన్స్ ఫిక్షన్ లో యాక్షన్ ని చూపించబోతున్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ కె అనేది సబ్జెక్ట్ ఏంటి ? గతంలో నాగ్ అశ్విన్ ఏం చెప్పాడు ? ఈ సినిమాని ఏ నవల ఆధారంగా తీస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం..

ప్రభాస్ తో సుమారు 800కోట్లకి పైగా ఖర్చుపెట్టి సైన్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాడు నాగ్ అశ్విన్. రైట్ పర్సన్ టు రైట్ యాక్టింగ్ అన్నట్లుగా నాగ్ అశ్విన్ చిన్న క్యారెక్టర్ కి కూడా పెద్ద ఆర్టిస్టులని ఇందులో వాడుతున్నాడు. టీజర్ చూస్తుంటే ఖచ్చితంగా అపదలో ఉన్నవారిని అదుకోవడానికి వచ్చిన దేవుడిలాగానే ప్రభాస్ కనిపిస్తున్నాడు. పైగా ఇది ఫ్యూచరిస్టిక్ సినిమా. దాదాపు 800యేళ్లు ముందుకు వెళ్లే సినిమా. మరి ఇంత అడ్వాన్స్ గా స్టోరీని ఎలా చెప్పబోతున్నారు. ఆ స్టోరీలో పాత్రలు ఎలా ఉంటాయి. ఎలా మాట్లాడతాయి అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఈ సినిమా కథని ఒక నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రాజెక్ట్ కే గ్లింప్స్ కు మహాభారతానికి లింక్ ఉందని చాలామంది కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోందంటే., కల్కి అని చెప్పకనే చెప్పారు. కల్కి 2889 ఎడి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్స్ గా టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. గతంలో నాగ్ అశ్విన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ మహా భారతం, స్టార్ వార్స్ ను చూస్తూ పెరిగానని అన్నాడు. ఈ రెండు ప్రపంచాలను కలిపే ప్రాజెక్ట్ కే సినిమాను చేయడం గర్వంగా ఉందని చెప్పాడు. మరి ఈ రెండు మిక్స్ అయితే సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది. కథ ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో మొదలైంది. అంతేకాదు, ప్రాజెక్ట్ కే సినిమాకు “డ్యూన్” అనే నవల స్పూర్తి గా తీశారనే సమాచారం తెలుస్తోంది. నిజానికి ప్రపంచ దేశాల్లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు డ్యూన్ అనే నవల ఆధారంగానే తెరకెక్కాయి. ఈ నవల ఆధారంగానే కథ ఉండబోతోంనేది సమాచారం. ఈ ప్రాజెక్ట్ కే సినిమాకి ఇప్పటికే 800 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించారు. ఇది ఇంకా పెరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. కమల్ హాసన్ లాంటి దిగ్గజ యాక్టర్ ఇందులో ఉండటం అనేది ఇప్పుడు అంచనాలని అమాంతంగా పెంచేసింది. అందులోనూ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ఈ ప్రాజెక్ట్ ని నమ్మి పెడుతున్నారు. ఇప్పుడు ఈ మూవీ టీజర్ చూసినవాళ్లు అందరూ
ఇండియన్ సినిమా హాలీవుడ్ రేంజ్ కి వెళ్లిందనే కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా ఉంటే ఖచ్చితంగా ఇది ఇండియన్ సినిమాని షేక్ చేస్తుంది. మరి మీకు ఏమనిపిస్తుందనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *